»Shubhalagnam In Real Life The Wife Who Sold Her Husband For Money
Viral News: రియల్ లైఫ్‌లో ‘శుభలగ్నం’..భర్తను అమ్మేసిన భార్య
శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం భర్తను అమ్మేసినట్లు..నిజజీవితంలోనూ ఓ మహిళ భర్తను అమ్మేసింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఎందుకు ఆ భార్య తన భర్తను అమ్మేసిందనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
Viral news: మీకు శుభలగ్నం సినిమా గుర్తుందా..ఇందులో ఆమని డబ్బు కోసం తన భర్త జగపతిబాబును రోజాకి అమ్మేస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రియల్ లైఫ్‌లో జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని మాండ్యకి సమీపంలో భార్యాభర్తలు ఉండేవారు. వీళ్లు ప్రేమానురాగాలతో చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు ఎలాంటి గొడవ పడకుండా చాలా మంచిగా ఉండేవారట. ఆమె భర్త అక్కడ ఉండే ఒక స్థానిక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ఆమెకు తెలిపింది. ఆ సన్నిహితం కాస్తా పడకగది వరకు వెళ్లింది. ఇది గమనించిన భార్య కొన్నిరోజులు సైలెంట్‌గానే ఉంది.
కొన్ని రోజులు తర్వాత పడకగది దగ్గర ఉన్నప్పుడు వాళ్లను నిలదీసింది. అలా ఇద్దరి ఆడవాళ్ల మధ్య గొడవ పెరిగి.. పంచాయితీ వరకు వెళ్లింది. ఆ స్థానిక మహిళ నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బు కట్టి నీ భర్తను తీసుకెళ్లమని తెలిపింది. దీంతో అలాంటి భర్త నాకు వద్దు. నువ్వే నాకు రూ.5 లక్షలు ఇచ్చి అతన్ని ఉంచుకో అని భార్య ఆఫర్ చేసింది. దీంతో పాటు ఆ డబ్బు ఇచ్చేందుకు ఆమెకు ఒక నెల సమయం కూడా ఇచ్చింది. ఇది విన్న పంచాయితీ పెద్దలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందులో మళ్లీ ఇంకో ట్విస్ట్ ఉందండి. ఆ స్థానిక మహిళ నెల రోజుల గడువుతో అతని కోసం ఆమెకు రూ.5 లక్షలు ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది.