విమాన (flight) ప్రయాణీకుల న్యూస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, మద్యం తాగి విచక్షణ రహితంగా ప్రవర్తించారని అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి విమాన ప్రయాణికురాలకు ఎదురైన ఓ విచిత్ర సంఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. డిజైనర్(Designer)గా జాబ్ చేస్తోన్న లేహ్ విలియమ్ అనే మహిళ జర్మనీ నుంచి లండన్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కింది. ఆమెకు పల్లీలంటే అలర్జీ(Allergy). కానీ విమాన సిబ్బంది పల్లి ప్యాకెట్స్ కోనాలని ఒత్తిడి చేశారట. తనకు అలర్జీ అని ఎంత చెప్పిన వారు వినిపించుకునే ప్రయత్నం చేయలేదట. అంతే కాకుండా.. 48 పల్లీల ప్యాకెట్లు ఆమెతో కొనిపించారట ఆమె అన్నారు. దాని రేట్ సుమారు 144 యూరోలు (రూ.13.088). అయితే.. విమాన టిక్కెట్‌కు చెల్లించిన 50 యూరెల కంటే దాదాపు మూడు రెట్లు చెల్లించాను.
ఎలా అయిన తన డబ్బు తనకు వాపస్ చేయాలని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆమెకు వేరుశెనగలు (Peanuts) అంటే అలర్జీ కాబట్టి ఫ్లైట్‌లో ఉన్నంత సేపు కనీసం ఆమె ఆ ప్యాకెట్ ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదట.దీనిపై స్పందించిన యూరోవింగ్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘బాధితురాలికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. కానీ, ఆమెను అన్నీ ప్యాకెట్స్ కొనుగోలు చేయమని బలవంతం చేయలేదు. ఆమె ఇష్టపూర్వకంగానే ప్యాకెట్లు కొన్నారు. అలాగే అలర్జీ కలిగించే వేరుశెనగ వంటి ఆహార పదార్థాలు విమానంలో ఉంచబోమని ప్రయాణికులకు హామీ ఇవ్వలేమని ఎయిర్ లైన్ (Air line) తెలిపింది. ప్రయాణికులు ఏమైనా అలర్జీ లాంటివి ఉంటే వారితో మెడిసన్ తీసుకురావాలని, అంతేకాకుండా దీని గురించి క్యాబిన్ (Cabin) సిబ్బందికి ముందు గానే తెలియజేయాలని కోరారు.