దేశంలో పాల రేట్లకు ( Milk Price ) రెక్కలు వచ్చాయి. గత 15 నెలల్లోనే పాల రేట్లు 13 నుంచి 15శాతం దాకా పెరిగాయి. అయితే ఇప్పట్లో పాల రేట్లు తగ్గకపోవచ్చని అన్నారు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపేందర్ సింగ్ సోధి. బహుశా రానున్న దీపావళి ( Diwali) వరకు పాల రేట్లు తగ్గకపోవచ్చని చెప్పారు. అకాల వర్షాలతో పశవులకు తగినంత దాణా దొరక్కపోవడం ఒక కారణమని చెప్పారు. పాలిచ్చే పశువుల సంఖ్య కూడా తగ్గిపోతున్నట్లు ఆయన తెలిపారు. మామూలుగా అయితే పాల ప్రొడక్షన్ అక్టోబర్ – ఫిబ్రవరి టైములో ఎక్కువగా ఉంటుదన్నారు. అలాంటి సందర్భాలలో డెయిరీ కంపెనీలు కూడా తమ ప్రొక్యూర్ మెంట్ ( పాల సేకరణ ) రేట్లను తగ్గిస్తాయని అన్నారు.
రాబోయే రెండేళ్లలో తగినంత పాలు అందుబాటులో ఉండాలంటే రైతులకు గిట్టుబాటు అయ్యే రేట్లను చెల్లించాల్సిందని సోధి అన్నారు. మే నెల దాకా చలికాలపు వాతావరణ ఉండటంతో పాటు.. గత రెడు నెలల్లో కురిసిన అకాల వర్షాల వలన దేశంలో పాల ప్రొడక్షన్ 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. రూపేందర్ సింగ్ సోధి గతంలో అమూల్ డెయిరీ కో-ఆపరేటివ్ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేశారు.