»Brides Parents Welcome Groom At Wedding By Lighting A Cigarette For Him Internet Is Shocked
Viral News : అల్లుడు కి సిగరెట్ తో స్వాగతం పలికిన అత్తమామలు..!
Viral News : కూతురికి పెళ్లి చేయాలంటే సవా లక్షా ఆలోచిస్తారు. అబ్బాయి మంచివాడేనా..? ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా లేదా అని ఆలోచించి ఆ తర్వాతే పెళ్లి చేస్తారు. అలాంటిది కాబోయే అల్లుడికి అత్త, మామలు దగ్గరుండి మరీ సిగరెట్ నోట్లో పెట్టి మరీ వెలిగించడం చేయడం ఎక్కడైనా చూశారా..? నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇది కళ్లారా కనపడటం గమనార్హం.
కూతురికి పెళ్లి చేయాలంటే సవా లక్షా ఆలోచిస్తారు. అబ్బాయి మంచివాడేనా..? ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా లేదా అని ఆలోచించి ఆ తర్వాతే పెళ్లి చేస్తారు. అలాంటిది కాబోయే అల్లుడికి అత్త, మామలు దగ్గరుండి మరీ సిగరెట్ నోట్లో పెట్టి మరీ వెలిగించడం చేయడం ఎక్కడైనా చూశారా..? నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇది కళ్లారా కనపడటం గమనార్హం.
పెండ్లి వేడుకలో వరుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బ్లాగర్ జుహీ కే పటేల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 57 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది.
ఈ పెండ్లి వేడుకకు అతిధిగా హాజరైన జుహీ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్తగారు స్వాగతించిన పెండ్లి వేడుకను ఇప్పుడే చూశానని ఆమె రాసుకొచ్చారు.
దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో అనుసరించే పాత సంప్రదాయం ఇదని, అతడు కనీసం పొగతాగలేదని, వీడియోలో వారు కేవలం ఆచారం కోసం నటించారని చెప్పుకొచ్చారు. ఈ ఆచారంపై నెటిజన్లు పెదవివిరిచారు. అసలు ఇదేం సంప్రదాయమని మరికొందరు విమర్శించడం గమనార్హం.