Another video of couple kissing goes viral, Delhi Metro issues statement for commuters
Viral video:మెట్రోలు వచ్చిన తర్వాత ప్రజల ప్రయాణం ఎంత కన్వినెంట్ గా ఉందో తెలీదు కానీ, ప్రేమికులకు మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూ జనాలు ఉన్నారు అని కూడా చూసుకోకుండా రొమాన్స్ చేస్తూ (Romance) రెచ్చిపోతున్నారు. కొద్ది రోజుల కిందట ఓ ప్రేమికుల జంట ముద్దులాట ఆడగా, తాజాగా మరో జంట కూడా మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మెట్రో కోచ్‌లో (metro coach) నేలపై కూర్చున్న యువ జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం వైరల్ వీడియోగా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇలా చేయడం అసభ్యకరంగా ఉందని, ఇలాంటి బిహేవియర్‌ను తీవ్రంగా ఖండించాలని చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్ట్ ఎటాక్ పేషెంట్లకు సీపీఆర్ చేస్తున్నావా అంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.
ఈ వీడియో పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది. ‘ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండమని’ తన ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా, మెట్రో అధికారులు ప్రయాణికులు అలాంటి సంఘటనలు ఏవైనా ఉంటే వెంటనే సమీపంలోని అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బంది/CISFకి తెలియజేయాలని అభ్యర్థించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, సమాజంలో ఆమోదయోగ్యమైన అన్ని సామాజిక మర్యాదలు, ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఆశిస్తున్నట్లు ప్రకటన పేర్కొంది.
“ప్రయాణికులు అసౌకర్యాన్ని కలిగించే లేదా ఇతర తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాలలో పాల్గొనకూడదు. DMRC యొక్క ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ చట్టం నిజానికి అసభ్యతను సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హమైన నేరం కిందకు వస్తుంది, ”అని ప్రకటన విడుదల చేశారు.