ADB: ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండల జాయింట్ యాక్షన్ కామేటి ఆధ్వర్యంలో గుడిహత్నూర్ లో శనివారం బంద్ చేపట్టారు. మండల కేంద్రంలో అన్ని వ్యాపార వర్గాలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ లో పాల్గొన్నారు.