WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు చిటమాట రఘు అన్నారు. రోహిర్ గ్రామ పార్టీ ముఖ్య నేతలతో రఘు సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు నిత్యం ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.