MBNR: అయిజ మండలం క్లాస్ పూర్ వీరభద్రప్ప క్యాన్సర్ బారిన పడి పట్టణంలోని SLN ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కురువ చిన్న తిమ్మప్ప శనివారం ఆస్పత్రికి చేరుకొని అతడిని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని నాగరదొడ్డి, వెంకట్రాములు పేర్కొన్నారు.