TG: తిరుమల లడ్డూ వివాదంపై BJYM నాయకురాలు భార్గవి కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో ఫొటో షూట్ చేసిన రోజా లడ్డూ వివాదంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. దేవుడి ప్రసాదం రోజా తినలేదా..? అని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో బీఫ్, ఫిష్ ఆయిల్ కలుపుతారా..? హిందూ కల్చర్ నాశనం చేయడానికే YCP పుట్టిందని ధ్వజమెత్తారు. ఇంకోసారి YCP నేతలు ఓట్లు అడగడానికి వస్తే రాళ్లతో కొట్టండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.