AP: తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వల్ల అపవిత్రమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం జంతు అవశేషాలతో మలినమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడి గట్టగలరని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తెలిసిన క్షణం తన మనసు వికలమైందని తెలిపారు.