తిరుమల లడ్డూ కల్తీ వార్తల వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని దేవాలయ బోర్టు పరిధిలోని 34 వేల ఆలయాల్లో తప్పనిసరిగా కేఎంఎఫ్ ఉత్పత్తి చేసే నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా దీపాలను వెలిగించటం కోసం, ప్రసాదం తయారీకి, ఇతర ఆచారాల కోసం నందిని నెయ్యిని ఉపయోగించాలని ఆదేశించింది. భక్తులకు ఇచ్చే ప్రసాదం, అన్నదానం నాణ్యతలో రాజీపడొద్దని సూచించింది.