KMM: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలో జరుగుతున్న అంశాలను తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు.