HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రంలో మున్సిపాలిటీ వాహన మరమత్తుల కేంద్రమును నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలో సేకరించిన చెత్తను సకాలంలో డంపింగ్ యార్డ్‌కు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.