వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. కౌన్సిల్ ఎజెండాలో ముఖ్యంగా 10 అంశాల పైన చర్చించనున్నారు. పారిశుద్ధ్య కార్మికుల చెల్లింపులు, పదవీకాలం, రూ.5 భోజన పథకం, మున్సిపల్ అద్దె దుకాణాల వేలం, అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా పనులకు నిధుల మంజూరు, 250 మందిని శానిటేషన్లోకి కొత్తగా తీసుకోవడం తదితర అంశాలపై చర్చించనున్నారు.