MNCL: మందమర్రి మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో చదువుతున్న ఈ. శ్రీనిధి, జి. రష్మిత రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మంజుల, పిడి విశాల తెలిపారు. ఇవాళ నస్పూర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జోనల్ స్థాయి కరాటే పోటీల్లో అండర్-19 విభాగంలో శ్రీనిధి, అండర్-17 విభాగంలో రష్మిత ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు.