KMR: పట్టణంలో అక్టోబర్ 5న జరిగే భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబా అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో విడుదల చేసిన డిక్లరేషన్ అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.