ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గుత్తి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి సూపర్డెంట్ ఎల్లప్ప తో కలిసి భోజనాలను అందజేశారు.