భార్యతో శృంగారం చేసినా.. ఆమె మైనర్ అయితే అది అత్యాచారమే అవుతుందని ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను కోర్టు సమర్థించింది. నిందితుడు తన భార్య పెట్టిన రేప్ కేసును సవాల్ చేస్తూ ముంబై కోర్టును ఆశ్రయించగా.. నాగ్పూర్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లలోపు అమ్మాయిని పెళ్లాడి, కాపురం చేస్తే.. అది రేప్ అవుతుందని స్పష్టం చేసింది.