శంఖం పూలను ఆయుర్వేదంలో పలు వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ పూలలో విటమిన్ ఎ, సి, ఇ.. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలని ప్రోత్సహించి, కేశాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రోజూ ఈ పూలతో చేసిన టీ తాగితే ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. శరీర బరువు తగ్గుతుంది.