NGKL: లింగాల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు నేడు హైదరాబాద్లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. మండల నాయకులు రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికే ఎరుకల కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్నారు.