AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు హైకోర్టు బ్రేక్ వేసింది. రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ మోషేనర్ రాజు వేసిన అనర్హత వేటును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2027 నవంబర్ 31 వరకు ఎమ్మెల్సీగా రఘురాజు కొనసాగనున్నారు. కాగా, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది.