SRD: రెగ్యులర్ గా వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.