సాధారణంగా ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలంటే.. ఎంతో వినయంగా కారణం వివరించి మెయిల్గానీ, మెసేజ్ కానీ చేస్తాం. కానీ ఓ ఉద్యోగి సెలవు కోరుతూ ”హాయ్ సిద్ధార్థ్, నవంబర్ 8న సెలవు తీసుకుంటా. బాయ్” అని రాశాడు. దీనిని తన టీమ్ సభ్యుడు ‘ఎక్స్’ వేదికగా పంచుకోగా.. నెటిజన్ల ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తక్కువ పదాలతో రాసిన ఈ మెయిల్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.