AP: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ చట్టం భూములను కబ్జా చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పారు. వైసీపీ గూండాలు విచ్చలవిడిగా భూకబ్జాలు చేశారని ఆరోపించారు. కబ్జాదారుని అక్రమాస్తులను జప్తు చేస్తామన్నారు. భూ కబ్జా కేసుల కోసం ప్రత్యేక కోర్టు పెడతామని తెలిపారు. ఇక రాష్ట్రంలోని అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు.