AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై సచివాలయంలో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. వారంలోపు పెద్దసంఖ్యలో నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందే పదవుల భర్తీకి సీఎం కసరత్తు చేస్తున్నారు. కాగా, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పదవులు ఇచ్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.