AP: సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ జయరాం ప్రసాద్ పేర్కొన్నారు. ‘సీఎం చంద్రబాబు ఫొటోను ఫేస్బుక్ మార్ఫింగ్ చేసి పెట్టారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేశాం. నిందితుడు వెంకటరామిరెడ్డిని కోర్టులో హాజరుపరిచాం. కోర్టు వెంకటరామిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది’ అని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.