ELR: చింతలపూడి మండలం రాఘవాపురంలో నాటు సారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వింజమూడి వెంకటరమణ అనే మహిళను అదుపులోకి తీసుకొని.. ఆమె వద్ద 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అనంతరం మహిళపై కేసు నమోదు చేశామని తెలిపారు. నాటు సారా విక్రయించిన తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.