AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి కేసులో మరో అధికారిపై వేటు పడింది. కడప చిన్నచౌకు సీఐ తేజోమూర్తిని డీఐజీ కోయ ప్రవీణ్ సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో సిఐనీ సస్పెండ్ చేసినట్లు డీఐజీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది.