HYD: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ బుధవారం ప్రారంభించారు. సర్వే బృందాలు ప్రతి కుటుంబాన్ని సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు డాక్టర్ సామల హేమ, రాసురి సునీత రమేష్, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.