NLR: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బుధవారం సాయంత్రం కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగంటి మహీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని ఆదాల క్యాంపు కార్యాలయంలో ఇరువురు నాయకులు పలు అంశాలపైన చర్చించారు. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.