HYD: రాష్ట్రంలో ఈసారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు.