TG: హైడ్రా గురించి బ్యాంకర్లకు ఆందోళన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్‌హెచ్‌జీ రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు.