ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిపై కోల్కతాలోని విధాన్ నగర్ సౌత్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 27న బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో జరిగిన బీజేపీ సభలో మిథున్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. ‘2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధికార పీఠం బీజేపీకి కైవసం అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏమేం చేయాలో అవన్నీ బీజేపీ శ్రేణులు చేసి తీరుతాయి’ అని మిథున్ వ్యాఖ్యానించారు.