AP: తిరుమల శ్రీవారి పవిత్రను కాపాడేందుకు కృషిచేస్తానని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి టీటీడీ పాలకమండలి నూతన సభ్యులు హాజరయ్యారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.