ATP: నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలకు నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే బండారు శ్రావణీని సీపీఎం కోరింది. తుంగభద్ర ఎగువకాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని, హంద్రీనీవా కాలువ పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేయాలని కోరింది. నీటి వనరుల అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు సీపీఎం నాయకులు ఓ.నల్లప్ప, ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు.