ఉత్తరప్రదేశ్లో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు ఓ ఇంటిని కూల్చివేశారు. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండా నివాసాన్ని కూల్చివేశారని ఆరోపిస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అధికారుల చర్యపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడికి రూ. 25 లక్షల నష్ట పరిహారం అందించాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.