AP: కడప ఎస్పీ హర్షవర్ధన్రాజును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం నేత వర్రా రవీంద్రారెడ్డి కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. వైసీపీ నాయకులకు అనూకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, సీఐని కూడా సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.