TG: ఆర్అండ్బీ అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రమత్తు వీడి.. రోడ్లకు మరమ్మతులు చేయాలని సూచించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఇంత ఆలస్యం ఎందుకన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయకుండా మీనమేషాలు లెక్కించడమేంటని ప్రశ్నించారు. అధికారులు మాటలు చెప్పడం కాదు.. ఫలితం చూపించాలని కోరారు.