NZB: ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని కామారెడ్డి SP సింధూ శర్మ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని, సైబర్ క్రైమ్ ద్వారా బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలన్నారు.