NZB: ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నేడు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎస్ఐసీ చౌరస్తా నుంచి ప్రారంభించి మున్సిపల్ కార్యాలయం- ఎన్టీఆర్ చౌరస్తా- పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.