SRD: సిర్గాపూర్ మండలం పోచపూర్, సిర్గాపూర్ వేర్వేరు ప్రాంతాల్లో పేకాటాడుతున్న స్థావరాలపై దాడులు జరిపి 15 మందిపై కేసు నమోదు చేసినట్టు సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ASI రవీందర్, సిబ్బంది స్థావరాలకు వెళ్లి మొత్తం 15 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 39,560 నగదు సీజ్ చేసి కేసు నమోదుచేశామన్నారు.