WNP: అన్నదాతలు అధైర్యపడాల్సిన అవసరంలేదని, నెల రోజుల్లో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. 10 ఏళ్ల కాలంలో రూ.లక్ష రుణమాఫీ చేయని BRS నేతలు కొందరు రైతుల పక్షాన ముసలి కన్నీరు కారుస్తూ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు.