మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లిలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో పోచమ్మ తల్లి స్థిర ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ.శివకుమార్, నరేందర్, చింతల నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.