WGL: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కలిశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరు, సభ్యత్వ నమోదు కార్యక్రమం, తదితర అంశాలపై జాతీయ ప్రధాన కార్యదర్శితో ప్రేమేందర్ రెడ్డి చర్చించారు.