VKB: తాండూరు పట్టణంలో కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ HYDకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ జగదీశ్వర్ ఓ ఇంటివద్ద పనులు ప్రారంభించగా అసోసియేషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యులు వచ్చి పనులను అడ్డుకున్నారు. చట్టప్రకారం అనుమతులు ఉన్నా.. తమకు అవేవి పట్టవని బెదిరించి రూ.11 వేలు వసూలు చేసినట్లు బాధితుడు జగదీశ్వర్ తెలిపారు.