MDK: నిజాంపేట మండల కేంద్రంలోని కొలువుదీరిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పూజారి అంజా గౌడ్ లక్ష్మి తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించామన్నారు. నిజాంపేటలో ప్రసిద్ధిగాంచిన రేణుకమ్మను ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటారని తెలిపారు.