కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సెప్టెంబర్ 23 సోమవారం కొత్తపేట డివిజన్ ఆత్రేయపురం మండల కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందని కొత్తపేట డివిజన్ అధికారులు ఆత్రేయపురంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధి లోని అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.