AP: తిరుమల లడ్డూ నాణ్యతపై అనుమానంతోనే NDDB పరీక్షలకు పంపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ల్యాబ్ నివేదిక బయటపెట్టకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసేవి కావన్నారు. ఎదురుదాడితో జగన్ తన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడటం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోరని.. చేసిన తప్పుని సమర్థించుకుంటూ ప్రధానికి లేఖ రాయటానికి ఎంత ధైర్యమని ధ్వజమెత్తారు. వాళ్ల స్టేట్మెంట్లు చేస్తుంటే కడుపు రగులుతోందన్నారు.