MDK: రేపు మెదక్ పట్టణ కేంద్రంలోని ద్వారక గార్డెన్లో కుల గణన స్థితిగతులను ఉద్దేశించి మెదక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడును. మెదక్ జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.