SRPT: తుంగతుర్తి మండల నూతన ఎస్సై క్రాంతి కుమార్ను టీడబ్ల్యూజేఫ్ యూనియన్ నాయకులు శనివారం కలిశారు. ఇటీవల ఆయన తుంగతుర్తి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి సుభాష్, జమున, శశిధర్, పోతురాజు వెంకన్న, అశోక్, యాకన్న, అక్కినపల్లి రాములు, బండి కిరణ్ కుమార్, షేక్ జానీ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.